Thursday, March 12, 2026
spot_img

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఒంటిపూట బడులు

ఎండాకాలం వచ్చేసింది. భానుడి భగభగలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరువైంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలల వేళలు మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
15 నుంచి షురూ..
రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయి. సర్కారు బడులో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12:30 గంటలకు అందిస్తారు.

spot_imgspot_img

Hot Topics

Related Articles