Wednesday, February 18, 2026
Google search engine
Homeతెలంగాణమున్సిపల్ ఎలక్షన్స్ ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలే ఉంది

మున్సిపల్ ఎలక్షన్స్ ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలే ఉంది

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మున్సిపల్ ఎన్నికలు ట్రయల్ మాత్రమే అనే సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేం పార్టీ పెడతామనగానే బీఆర్ఎస్ లీడర్లు కారు కూతలు కూస్తున్నరని విమర్శించారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో కారు పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పోల్చుకుంటుందిని ఎద్దేవా చేశారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిస్తే ఇప్పుడు 16 స్థానాలకే పరిమితం అయ్యారని గుర్తు చేశారు. ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలని హితవు పలికారు. సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తోందన్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సాంబశివరావు గారు కేసీఆర్ పై చేసిన ఆరోపణలను ఆమోదిస్తున్నారా? కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన సీపీఐ కి మద్దతివ్వటమంటే నయవంచనే అని స్పస్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతికి చెందిన 40 మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించారని అన్నారు.మా లాంటి కొత్త తరహా రాజకీయాల చేసే వారిని ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అల్టర్ నేట్ లేకనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని వివరించారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప అన్ని చోట్ల అష్టకష్టాలు పడిందన్నారు. కానీ ఈ ఎన్నికల్లో మాలాంటి న్యూ ప్లేయర్ ను ప్రజలు ఆదరించారు. త్వరలోనే మేము రాజకీయ పార్టీగా మారబోతున్నామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశాం. సమయం తక్కువగా ఉన్నప్పటికీ మా కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని 40 స్థానాల్లో గెలిపించారు. అధికారికంగా 33 స్థానాలు అయినప్పటికీ కొంతమందికి భీ ఫామ్ ఇవ్వటంలో ఇబ్బంది అయ్యింది. అలా మరో ఏడు స్థానాల్లో మా అభ్యర్థులే గెలిచారు. వడ్డెపల్లి లో మాకు క్లియర్ మాన్ డేట్ ను ప్రజలు కట్టబెట్టారు. కానీ కాంగ్రెస్ వాళ్లు ప్రలోభాలు పెట్టి వారిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఛైర్మన్ ఎన్నిక వరకు ఏమీ జరుగుతుందో తెలియదు. అందుకే దాని గురించి మాట్లాడటం లేదు. ఇక నారాయణ్ పేట్ లో మాకు వైస్ ఛైర్మన్ ఆఫర్ చేస్తున్నారు. ఐతే దీనిపై లోకల్ నాయకత్వాన్నే నిర్ణయం తీసుకోమని చెప్పటం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఉంది. కచ్చితంగా మాలాంటి వాళ్లను ప్రజలు స్వాగతిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. ఇక మేము రాజకీయ పార్టీగా వస్తామని అనగానే బీఆర్ఎస్ వాళ్లు ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. వాళ్లకు ఏ సిర్ఫ్ ట్రైలర్ హై, పిక్చర్ బాకీ హై అని చెబుతున్నా. ఇప్పుడే కారుకూతలు కూయకండి అని హెచ్చరిస్తున్నా. సింగరేణి కార్మికుల కోసం జాగృతి, హెచ్ఎంఎస్ మాత్రమే పనిచేస్తోందని వివరించారు. త్వరలో జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హెచ్ఎంఎస్, జాగృతి కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు.

- Advertisment -
Google search engine

Most Popular