Petrol cheap | అక్కడ రూ.2లకే లీటర్ పెట్రోల్!
- Petrol cheap | పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై చూపింది. హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో క్రూడాయిల్ రవాణా వ్యవస్థ స్తంభించింది. పెట్రోల్ ధరలకు ఒక్కసారిగా రెక్కలోచ్చాయి. అయితే ఆ దేశాల్లో మాత్రం ఇప్పటికీ చాలా చౌకండి. వాటి గురించి తెలుసుకుందామా మరి. ( ఏప్రిల్ 6, 2026 ధరల ఆధారంగా)
లిబియాలో రూ.2.14 మాత్రమే..
ప్రపంచంలోనే పెట్రోల్(petorl) ధర అతి తక్కువగా ఉన్న దేశం లిబియా. ఇక్కడ లీటర్ కేవలం 0.023 డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో రూ. 2.14లు. తర్వాత స్థానాల్లో ఇరాన్ (రూ.2.70), వెనుజులా (రూ.3.26), అంగోలా(రూ.30.43), కువైట్ (రూ.31.55), అల్జీరియా (రూ.32.95), తుర్కమెనిస్తాన్ (రూ.39.83), ఈజిప్ట్ (రూ.40.86), కజకిస్తాన్ (రూ.48.95),ఖతార్ (రూ.52.30), సౌదీ అరేబియా (రూ.57.79), ఒమన్ (రూ.57.89), ఇరాక్ (రూ.60.40), బెహ్రాయిన్ (రూ.62.36) ఉన్నాయి.
మన పొరుగు దేశాల్లో
ఇండోనేషియా(రూ.67.69), భూటాన్ (రూ.85.38), బంగ్లాదేశ్ (రూ.90.50),మాల్దీవులు(రూ.96.46), ఆఫ్ఘనిస్తాన్ (రూ.88.82), ఇండియాలో రూ.101.39, చైనా(రూ.124.86), పాకిస్తాన్(రూ.126.25), నేపాల్(రూ.126.44), శ్రీలంక(రూ.134.26), బర్మా(రూ.141.52)
అక్కడ మాత్రం చాలా హాట్
హాంగ్ కాంగ్ లో ప్రపంచంలోనే అత్యధికంగా రూ.384.90 గా ఉంది. తర్వాత మాల్వి(రూ.358.18), నెదర్లాండ్స్(రూ.252.18), డెన్మార్క్(రూ.250.79) ఇజ్రాయిల్(రూ.245.76), మొనాకో(రూ.239.34), జర్మనీ(రూ.235.24), లిచ్ టెస్టిన్(రూ.231.05), సింగపూర్(రూ.223.98), గ్రీస్(రూ.223.79), అల్బెనీయా(రూ.223.70), ఫిన్ ల్యాండ్(రూ.219.69), స్విట్జర్లాండ్(రూ.218.58), ఫ్రాన్స్(రూ.215.04)
- ఇది కూడా చదవండి : సగం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!