Thursday, March 26, 2026
spot_img

కవిత కొత్త పార్టీ.. ముహూర్తం ఖరారు.. రేపే నిజామాబాద్ లో ప్రకటన?

తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ‘ప్రజా జాగృతి’గా వస్తునున్నట్లుగా ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కల్వకుంట్ల కవిత త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా వస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే. ఈ క్రమంలో తాజాగా శ్రీరామ నవమి పర్వదినాన నిజామాబాద్ వేదికగా పార్టీ ప్రకటన తేదీ ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
గుర్తు.. జెండా ఇవేనా?
పార్టీ గుర్తు ధర్మగంట ఉండాలని ఈసీని కోరినట్లుగా తెలుస్తుంది. అలాగే జెండా పసుపు రంగు ఉండనున్నట్లుగా సమాచారం. మరోవైపు పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఏప్రిల్ 25న హైదరాబాద్ లో వేదిక కూడా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది.
మెట్టినింటి నుంచే..
శ్రీరామ నవమి సందర్భంగా కవిత తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా కీలక ప్రకటన చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అది పార్టీ ప్రకటనే అయి ఉండవచ్చని తెలుస్తుంది. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పాట కూడా ఖరారు
ఇప్పటికే ‘ఆడ పులి కవితక్క’ అంటూ నల్లగొండ గద్దర్ గళం నుంచి వచ్చిన ఓ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జాగృతి శ్రేణుల్లో జోష్ నింపుతుంది.

spot_imgspot_img

Hot Topics

Related Articles