అన్నదాతకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. ఈనెల 22 నుంచి రైతు భరోసా షురూ చేయనున్నట్లు ప్రకటించింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది రైతులకు గాను దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయ లు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
మూడు విడతల్లో..
తొలి విడతగా ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో ఎకరం లోపు ఉన్నవారికి జమ చేస్తారు. పక్షం రోజుల తర్వాత రెండో విడత, వచ్చే నెలాఖరు లోపు మూడో విడత నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కాంగ్రెస్ హయాంలో నాలుగోసారి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడు విడతల్లో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. నాలుగో విడతను సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభించనున్నారు.



