‘బంగారు’ మాట.. ఇదే మంచి సమయయా.. మించినా దొరకదా!
- The word ‘golden’… is this a good time?… పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది. వరుసగా తొమ్మిది రోజు తగ్గడం పరిస్థితికి అద్దం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర సోమవారం నాలుగు నెలల కనిష్టానికి చేరువైంది. తాజాగా 4,138 డాలర్లకు దిగివచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 1,36,650 పలికింది. ముందు రోజుతో పోల్చితే రూ.10,320 మేర తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా కిలో రూ.2.30లక్షలకు చేరింది. ముందు రోజుతో పోల్చితే రూ.20వేలు తగ్గడం గమనార్హం.
రికార్డు స్థాయి నుంచి కిందికు..
ఈ ఏడాది జనవరి 29, 2026న పుత్తడి 10 గ్రాములకు రూ.1,93,096 రికార్డు స్థాయి పలికింది. తాజా ధరతో పోల్చితే 33శాతం పైగా పడిపోవడం గమనార్హం. వెండి ధర ఈ ఏడాది జనవరి 29న కిలో రూ.4.25 లక్షలు పలకగా ప్రస్తుత ధరతో పోల్చితే ఏకంగా 45శాతం పైగా తగ్గంది.
యుద్ధ విరమణ ప్రకటనతో ..
అయితే సాయంత్రం యుద్ధానికి ఐదు రోజులపాటు బ్రేక్ వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన నేపథ్యంలో రాత్రి 8 గంటల సమయంలో మళ్లీ ధర పెరగడం గమనార్హం. పది గ్రామ పుత్తడి ఏకంగా రూ. 10 వేల వరకు పెరిగి రూ.1.46 లక్షలకు చేరువైనది. వెండి కూడా కిలో మరో రూ.2వేలు పెరిగి రూ.2.32లక్షలకు ఎగబాకింది. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.