* ఎన్నికల నగారా మోగింది. దేశంలో మినీ సంగ్రామానికి తెరలేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సీఈసీ వివరాలు వెల్లడించారు.
పశ్చిమబెంగాల్లో రెండు విడతలు
* పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గాను రెండు విడుతల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. ఇక తమిళనాడులో 234 స్థానాలు ఉండగా ఏప్రిల్ 23న ఎన్నికల తేదీ ఖరారైంది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఐదింటి ఫలితాలు మే 4 న వెల్లడి కానున్నాయి.



