రైతులకు శుభవార్త. కేంద్ర పెట్టుబడి సాయం నేడు అన్నదాతల ఖాతాల్లో జమ కానుంది. 22వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. అస్సాం లోని గౌహతి నుంచి లబ్దిదారులకు డిబీటీ విధానం ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్నారు. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున లబ్ధి చేకూరనుంది.
ఈ కేవైసీ తప్పనిసరి
రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకొని ఉండాలి. ఇందుకోసం పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్ లేదా సమీపంలోని సీఎస్సి కేంద్రాలను సంప్రదించాలి.




