కరోనాలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియ తాజాగా మళ్లీ వినిపిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తలెత్తింది. భారత ప్రభుత్వం మాత్రం డొమెస్టిక్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండకూండా చర్యలు చేపట్టింది. కమర్షియల్ పై మాత్రం ఆంక్షలు విధించింది. ఈ కారణంగా బెంగళూరు,ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడ్డాయి. క్యాంటీన్లలోనూ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండని పరిస్థితి. దీంతో హెచ్ సిఎల్ తో పాటు పలు టేక్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. మరికొన్ని అదే బాటలో ఉన్నాయి.
ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన
సుదూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు సొంత ఊళ్ల బాట పట్టే అవకాశం ఉంది. పలువురు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కొందరు టెకీలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం వర్క్ బర్డెన్ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొనడం గమనార్హం.




