Friday, February 20, 2026
Google search engine
HomeToday Specialసిద్దిపేట.. లేదా బోధన్.. పోటీ కి సిద్ధం అంటున్న కవిత .. మే మొదటి వారంలో...

సిద్దిపేట.. లేదా బోధన్.. పోటీ కి సిద్ధం అంటున్న కవిత .. మే మొదటి వారంలో పార్టీ

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రాబోతుంది. బీఆర్ఎస్ నుంచి దూరమైన కల్వకుంట్ల కవిత త్వరలో సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తాన ఉంటుందని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం
మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్టీ పేరులో తెలంగాణ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు తాను బోధన్, సిద్ధిపేట సహా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తామేనని, ప్రజల సమస్యలను బలంగా లేవనెత్తుతున్నామని అన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో తామే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముందుగా వస్తే ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ లీడర్లు చాలా మంది టచ్ లో ఉన్నారు

తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అయితే యువతకు పెద్దపీట వేస్తామన్నారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 50 కమిటీలు వేశామని వాటి ద్వారా అనేక చర్చలు చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీలో చేరేందుకు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఆసక్తితో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది తనతో టచ్ లో ఉన్నారని సందర్భం వచ్చినప్పుడు వివరాలు చెబుతానన్నారు.

- Advertisment -
Google search engine

Most Popular