కొణిదెల రామ్ చరణ్ తేజ్.. సినీ జగత్తులో తన కంటూ ఓ పేజీని లిఖించుకున్న నటుడు. తండ్రి వారసత్వంగా ‘చిరు’తగా ఎంట్రీ ఇచ్చినా అనతికాలంలోనే అభిమానుల మది దోచుకున్న మగధీరుడు. ఓ‘రేంజ్’లో రచ్చతో ఇరగదీసి అందరికి నచ్చే నాయక్ అయ్యాడు. హిట్లలో తుఫాన్‌గా మారి .. ఎవడికి అందనంత ఎత్తుకు చేరాడు. క్రమశిక్షణలో అందరికీ నచ్చీ మెచ్చే గోవిందుడయ్యాడు. బ్రూస్‌లీ ఫైట్లతో ధ్రువతారగా నిలిచాడు. రంగస్థలంపై తన నటనతో వినయ విధేయుడిగా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలందుకున్నాడు. సినీ ప్రపంచంలో ట్రిపుల్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆచార్యుడిగా అందరి మన్ననలు పొంది గేమ్‌చేంజర్‌గా నిలిచి ‘పెద్ది’గా రాబోతున్నాడు.
సినీ ప్రస్థానం..
రెండు పదులు దాటగానే తెలుగు ఇండస్ట్రీలోకి చిరుతగా అడుగీడిన చరణ్.. పూరి దర్శకత్వంలో ‘అన్నయ్య’ అభిమానులకు హీరోగా సూపరిచితమయ్యాడు. 2007లో విడుదలైన ఈ చిత్రం అంచనాలు మించి సూపర్ హిట్ నమోదు చేసుకుంది. చెర్రీని ఆ ఏడాది ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు వరించాయి. తర్వాత వచ్చిన మూవీ రాజమౌళి దర్శకత్వం లోని మగధీర. ఇది సంచలన విజయంతో టాలీవుడ్ ను షేక్ చేసింది. ఆ ఏడాది చరణ్ ఖాతాలోకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ , నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులు చేరాయి. 2010లో భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆరెంజ్ కు నెగటివ్ టాక్ వచ్చినా చరణ్ యాక్షన్ కు మాత్రం విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక 2011లో సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చ పూర్తిగా అభిమానుల హృదయాల్లోకి చొచ్చుకెళ్లి భారీ ఓపెనింగ్లను సాధించింది. సక్సెస్ కిక్ ఇండస్ట్రీలో దుమ్ము లేపింది. 2013లో వీవీ దర్శకత్వంలో వచ్చిన నాయక్ కూడా హిట్ జాబితాలోకే చేరింది. అదే ఏడాది అపూర్వ లాఖియా దర్శకత్వంలో వచ్చిన తుఫాన్ పరవా లేదనిపించింది. 2014లో వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎవడు సైతం సక్సెస్ బాటలొనే నడిచింది.2014లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన గోవిందుడు అందరివాడిగా నిలిచింది. 2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్ లీ పరవాలేదనిపించినా… 2016 లో వచ్చిన ధృవ సక్సెస్ కొట్టింది. 2018 లో వచ్చిన రంగస్థలం లో రాంచరణ్ తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం సక్సెస్ కే పరిమితం కాకుండా సెన్సేషనల్ నమోదు చేసింది. 2019 బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన వినయ విధేయ రామ కాస్త నిరాశ పరిచింది. ఇక 2022లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ రికార్డులనే తిరగరాసింది. తొలి రోజె ప్రపంచ వ్యాప్తంగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచనాలకు వేదికగా నిలిచింది. అదే ఏడాది వచ్చిన ఆచార్య డిజాస్టర్ జాబితాలోకి చేరింది. గత ఏడాది గేమ్ ఛేంజర్ కు పాజిటివ్ టాక్ దక్కింది. తాజాగా పెద్ది సినిమా అంచనాలతో రూపుదిద్దుకుంటుంది
చిత్ర విశేషాలు
ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానంది.
బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
రామ్ చరణ్ తేజ్ బయోగ్రఫీ..
పుట్టినరోజు : మార్చి 27, 1985
తల్లిదండ్రులు : సురేఖ-చిరంజీవి
సొదరీమణులు: శ్రీజ, సుష్మిత.
వివాహం : జూన్ 14, 2012న ఉపాసన కామినేని
పిల్లలు: క్లిమ్కారా, శివరాం అన్విరాదేవి
హాబీస్: హార్స్ రైడింగ్
నచ్చిన నటుడు : సూర్య
పేవరేట్ నటి : సమంత




