మున్సిపల్ పోరులో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కనిపించింది. మూడు కార్పొరేషన్లతో పాటు 85 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆదిక్యత ప్రదర్శించింది. మరికొన్నిచోట్ల మిత్రపక్షాలు, స్వతంత్రుల సహకారంతో మరిన్ని చేజెక్కించుకునే దిశగా అడుగులు వేస్తుంది. రికార్డు స్థాయి బల్దియాలను కైవసం చేసుకున్న క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. ఇక గత ఎన్నికల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన బీఆర్‌ఎస్ తాజాగా రెండో స్థానంలో నిలిచింది. కేవలం 13 మునిసిపాలిటీలతోనే సరి పెట్టుకోవాలసి వచ్చింది. పట్టణ పార్టీగా పేరుగాంచిన బిజెపి ఈసారి ఉత్తర తెలంగాణలో సత్తా చాటింది. కరీంనగర్ తోపాటు నిజామాబాద్ కార్పొరేషన్లలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది. ఈ రెండు చోట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్ అన్నీ తామై ముందుకు నడిపారు. అలాగే ఆదిలాబాద్, ఖానాపూర్ లో కూడా కమలం పాగా వేసేందుకు సిద్ధమైంది. గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా పెంచుకొని పట్టణ పార్టీగా మరోసారి నిరూపించుకుంది.
‘పుర’పోరులో దూసుకెళ్లిన హస్తం.. సైడ్ ఇచ్చిన ‘కారు’ .. ఉత్తరాన వికసించిన కమలం
RELATED ARTICLES
Recent Comments
on Hello world!




