మున్సిపల్ పోరులో భాగంగా ఉద్యమాల పురిటిగడ్డపై కషాయ జెండా ఎగిరింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో ‘కమలం’ వికసించింది. ఈ ఎన్నికలను స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి అయిన బండి సంజయ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్నీ తానై ముందుండి నడిపారు. మొత్తం 66 స్థానాలకు గాను బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. గత పాలకవర్గాన్ని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ ఈ సారి మూడో స్థానానికి పడిపోయింది. కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 9 స్థానాలే దక్కాయి. అలాగే ఎంఐఎం రెండు, ఏఐఎఫ్‌బీ ఒకటి, ఇతరులు 10 స్థానాల్లో నిలిచారు



