కాళోజీ స్ఫూర్తిగా..
పలుకు బడుల భాషతో..
నిజాలను నిర్భయంగా చెప్పాలని..
సామాన్యుని గొంతుకకు అక్షర స్పందనగా నిలవాలని..
బతుకమ్మ సాక్షిగా.. రాజన్నకు ప్రణమిల్లి (ఒట్టేసి) చెబుతున్నా..
పేద మనసులను తాకుతా.. ఆ మాటలనే కై గడుతా..
బాంఛన్ దొర బతుకులకు తోడునైతా
ప్చ్.. ఇదిరా మా గోస అనేలా నీడనైతా
కిరికిరీ గాళ్ల కాళ్లను కదిలిస్తా.. మాయగాళ్ల ముసుగు తొలగిస్తా..
గలీజుగాళ్ల బండారం బయటపెడతా.. నిజం నిప్పనేలా మెప్పిస్తా
పోరగాండ్ల బాతఖానీ.. ఎన్కటి ముసలోల్ల మాట.. ఆడోళ్ల ముచ్చటను
ఉన్నది ఉన్నట్లుగా.. కండ్లముందుంచుతా..
గుడిసె గుండె లోతులను.. ఖద్దరు, ఇస్త్రీ బట్టలకు చూపుతా
సర్కారుకందని కష్టాలను.. రెప్పమాటున దాగిన ఆ బాధకు సిరాచుక్కనవుతా
కన్నీళ్లకు దూలంగా నిలుస్తూ న్యాయంతో సోపతి చేస్తా..
‘ఖుల్లంఖుల్ల’గా మీ ముందుకు వస్తున్నా..
ఆదరించి.. అక్కున చేర్చుకోండి.
మీ వాడిగా సదా మీ నోటిలో నానేలా దీవించుమని అడుగుతున్నా..
– ఎడిటర్, ఖుల్లంఖుల్లా



