প্রিন্ট এর তারিখঃ মার্চ ৩০, ২০২৬, ৪:৪০ এ.এম || প্রকাশের তারিখঃ মার্চ ২৯, ২০২৬, ৬:৩৭ পি.এম
నిన్న వెలుగుమట్ల.. నేడు ఔట్ సోర్సింగ్.. సమస్యల దారిలో ఆ ఇద్దరు!
సమస్య ఏదైనా.. బాధితుల పక్షాన తామంటూ ముందుకు సాగుతున్నారు ఆ ఇద్దరు. ఇందులో ఒకరు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మరొకరు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహరాజ్.
- వెలుగుమట్లలో..
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత, విశారదన్ ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ కూడా అయ్యారు. ఆయా వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం స్పందించింది. బాధితులకు టోకెన్లు జారీ చేయడంతో వారు ఆందోళన విరమించారు.
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం
* తాజాగా ఇందిరా పార్క్ వద్ద ఆదివారం నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు వీరిద్దరూ మద్దతు తెలిపారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఇరువురు ఆందోళన బాట పడుతున్నారు. బాధితులకు అండగా ఉంటూ జనం గొంతుకగా నిలుస్తున్నారు. పరిష్కారంపై భరోసా కల్పించేలా చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో మరికొన్ని వర్గాలు వీరిని ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. కాగా, కొత్తగా పార్టీ పెట్టనున్న కవితకు ఇది ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి మరి.
Copyright © 2026 khullamkhulla.net. All rights reserved.